Credits: Twitter

Tirumala, Dec 31: కరోనా (Corona) ప్రభావం వల్ల 2020, 2021లో తిరుమల (Tirumala) క్షేత్రంలో తీవ్ర ఆంక్షల వల్ల భక్తులు పెద్దగా రాలేకపోయారు. 2022లో ఆ పరిస్థితి లేదు. ఆంక్షల ఎత్తివేతతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. స్వామి వారి హుండీ కూడా అదే స్థాయిలో కళకళలాడింది. ఈ ఏడాది తిరుమల వెంకన్నకు కేవలం హుండీ కానుకల రూపేణా రూ.1,320 కోట్లు లభించింది. ఈ మేరకు టీటీడీ (TTD) శ్వేతపత్రంలో పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు.

ప్రపంచ బ్లిట్జ్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి రికార్డ్.. రజత పతకం కైవసం

ఈ సంవత్సరం ఇప్పటిదాకా స్వామివారిని 2.35 కోట్ల మంది దర్శనం చేసుకున్నారని... 1.08 కోట్ల మంది భక్తుల తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారని... 11.42 కోట్ల లడ్డూల విక్రయాలు జరిగాయని టీటీడీ వివరించింది.