Mass Marriages in Tirupati: ఆగస్ట్ 7న తిరుమలలో సామూహిక వివాహాలు, పేర్లు నమోదు చేసుకోవాలంటూ ఆహ్వానించిన టీటీడీ, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసా?
Representational Image (Photo Credits: Pexels)

Tirupati, June 10: తిరుపతి తిరుమల దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో ఉచిత సామూహిక వివాహాలు జరుగనున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక వివాహాలు (mass marriages) జరిపించాలని టీటీడీ నిర్ణయించింది. పేదింటి పిల్లల పెళ్లిళ్లు వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉచిత సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టినట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీఎంగా ఉన్న రోజుల్లో కళ్యాణమస్తు పేరుతో ఉచిత సామూహిక వివాహాలు జరిపించారని వైవీ సుబ్బారెడ్డి గుర్తుచేశారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా భారమై ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Vijaya Sai Reddy: జూమ్‌లోనే మ్యూట్ చేసి పారిపోయావ్, డైరెక్ట్‌గా వ‌స్తే త‌ట్టుకోగ‌ల‌వా లోకేశం, ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు విసిరిన విజయసాయి రెడ్డి  

ఆగస్టు 7న చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఆదివారం ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో వివాహాలు జరిపించాలని పండితులు సుముహూర్తం నిర్ణయించారని తెలిపారు.

Lokesh Zoom Meeting: నారా లోకేష్ జూమ్ మీటింగ్ రచ్చ, పారిపోయాడన్న కొడాలి నాని, జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపిన అచ్చెన్నాయుడు  

అర్హులైన వారు తమ జిల్లాల కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే కూడా టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వైఎస్సార్‌ తీసుకొచ్చిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఆదేశాలతో పునఃప్రారంభించడం సంతోషంగా ఉందని వైవీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు.