Vijayawada, Feb 28: ఆంధ్రప్రదేశ్ లో (Andhrapradesh) ప్రముఖ పాల బ్రాండ్ విజయ (Vijaya) పాల ధర పెరిగింది. అరలీటరు ప్యాకెట్ సహా ఆరు రకాల ప్యాకెట్ల ధరలను రూపాయి చొప్పున పెంచుతూ కృష్ణా మిల్క్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. అంటే లీటరు పాల ప్యాకెట్ పై మొత్తంగా రూ. 2 పెంపు జరిగింది. పెరిగిన ధరతో అర లీటరు లో ఫ్యాట్ (డీటీఎం) ధర రూ.27, ఎకానమీ (టీఎం) రూ. 29, ప్రీమియం (స్టాండర్డ్) రూ. 31, స్పెషల్ (ఫుల్‌క్రీమ్) రూ. 36, గోల్డ్ రూ. 37, టీ మేట్ ధర రూ. 34కు పెరిగినట్టు మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వరబాబు తెలిపారు. తాజా పెంపు ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి.
పెట్టుబడులే ధ్యేయంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్, ప్రారంభ సెషన్‌లో స్పీచ్ ఇవ్వనున్న బిజినెస్ టైకూన్స్
చిన్న పాల ప్యాకెట్లు, పెరుగు, పాల పదార్థాల విక్రయ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని ఎండీ పేర్కొన్నారు. పాల సేకరణ ధరలు పెరగడం, నిర్వహణ, రవాణా ఖర్చులు అధికం కావడంతోనే ధర పెంచాల్సి వచ్చిందని ఈశ్వరబాబు తెలిపారు.
Vijaya milk prices hiked by Rs 2 per litre#curd #KolliEswaraRao #milk #milkpackets #VijayaDairy #AndhraPradesh https://t.co/XKpICdB5ZR
— The Pioneer (@ThePynr) February 28, 2023