Divya's Murder Case Facts: దివ్యను లక్షకు అమ్మేశారు, శరీరం కుళ్లిపోయేలా వాతలు పెట్టి చంపేశారు, విశాఖ దివ్య హత్యకేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
Image Used for Representational Purpose Only | (Photo Credits: ANI)

Visakhapatnam, June 18: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విశాఖపట్నం దివ్య హత్య కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు (Divya's Murder Case Facts) బయటకు వస్తున్నాయి. పోలీసులు (Visakhapatnam police) హత్య కేసును విచారిస్తున్న సమయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతవారం అరెస్ట్ చేసిన‌ నిందితులలో దివ్య పిన్ని కాంతవేణితో పాటు మరికొందరిని పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు‌ కస్టడీలోకి తీసుకుని విచారించిన సమయంలో (Police Investigation) షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. విశాఖ మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది, దివ్య హత్య కేసులో మొత్తం ఆరుమంది అరెస్ట్, లోతుగా విచారణ చేపడుతున్న విశాఖ ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు

రెండేళ్ల క్రితం దివ్య అమ్మమ్మ, తల్లి, సోదరుడు అనుమానస్పదంగా మృతి చెందడంతో అనాధగా మారిన దివ్యను సొంత పిన్ని కాంతవేణి చేరదీసింది. అయితే అప్పటికే వ్యభిచార వృత్తిలో ఉన్న పిన్ని కాంతవేణి అనాధ అయిన దివ్యను కూడా బలవంతంగా ఒత్తిడి చేసి వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా తనకి పరిచయమున్న వ్యభిచార నిర్వహకురాలు గీతకి దివ్యను లక్ష రూపాయిలకి ఆమె పిన్ని‌ కాంతవేణి అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అప్పటికే కాంతవేణి సహజీవనం చేస్తున్న కృష్ణ అనే వ్యక్తి బ్యాంకు అకౌంట్ లోకి గత ఏడాది సుమారు లక్ష రూపాయిలు గీత అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ కావడాన్ని పోలీసులు గుర్తించి ఆరా తీయగా దివ్యను గీతకి అమ్మేసిన నిజం బయటకు వచ్చింది. దివ్యను కొనుక్కున్న గీత కొన్ని రోజుల పాటు ఆమె ద్వారా బాగా సంపాదించింది. ఆ తర్వాత పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో మరొక వ్యభిచార నిర్వహకురాలు వసంత వద్దకు దివ్యను పంపింది. అయితే ఆ తరువాత దివ్యను తనతో పంపాలని గీత అడగడంతో డబ్బులు రుచి మరిగిన వసంత దివ్య తన దగ్గర నుంచి వెళ్లిపోయిందని‌ అబద్దం చెప్పింది. గీత ఒత్తిడి తగ్గడంతో వసంత దివ్య ద్వారా బాగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది.

అయితే దివ్య ద్వారా డబ్బులు సంపాదించిన వసంత ఆమెకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దీంతో దివ్య బయటకి వెళ్లిపోవాలని అనుకోవడంతో కోపం పెంచుకున్న వసంత ఆమెను అందవి హీనంగా మార్చివేసింది. దివ్య కాళ్లూ చేతులు కట్టి గదిలో బంధించి గుండు కొట్టించి, కనుబొమ్ముల సైతం పూర్తిగా కత్తిరించి అందవిహీనంగా తయారు చేసింది. అప్పటికీ కక్ష తీరక క్రూరాతి క్రూరంగా పెద్ద అట్ల కాడను బాగాకాల్చి శరీరంలోని‌ ప్రతీ భాగంపై వాతలు పెట్టింది.

నాలుగైదు రోజులపాటు భోజనం కూడాపెట్టకుండా రోజూ వాతలు పెట్టడంతో దివ్య శరీరం కుళ్లిపోయి చివరకు చనిపోయింది. దీంతో దివ్య హత్యను సైతం కప్పిపుచ్చడానికి వసంత ప్రయత్నించింది. దహన సంస్కారాలకి ఉపయోగించే వాహనంలో దివ్య మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాలని వసంత ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి పోలీసులకి పట్టించింది. దివ్య మృతదేహంపై గాయాలను వ్యాన్ డ్రైవర్ గుర్తించడంతో అనుమానాలు వ్యక్తం చేసిన డ్రైవర్ వెనక్కి వెళ్లిపోయి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో దివ్య హత్య ఉదంతం పూర్తిగా బయటపడింది. దివ్య హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది‌ మందిని‌ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా విశాఖ పోలీసులు కాంతవేణితో సహజీవనం చేసిన కృష్ణ, దివ్య భర్త వీరబాబులను సైతం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కొసమెరుపు ఏంటంటే కట్టుకున్న భర్తే ఆమెను వ్యభిచార కూపంలోకి దించడం..