Amaravati, April 13: దేశంలోని చాలా ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడు భగభగమంటున్నాడు. గత కొద్ది రోజులు వర్షాలతో వాతావరణం కొంత చల్లగా మారినప్పటికీ.. మళ్లీ ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. మధ్యాహ్నంపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇక ఏపీ ప్రజలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ పేర్కొంది. దీంతో, అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. కాగా, రేపు ఏడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు.. ఎల్లుండి 106 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(168)..
అల్లూరిసీతారామరాజు జిల్లా- 7,
అనకాపల్లి -13,
తూర్పుగోదావరి- 14,
ఏలూరు- 11,
గుంటూరు- 11,
కాకినాడ -14,
కోనసీమ- 6,
కృష్ణా - 11,
నంద్యాల -4,
ఎన్టీఆర్ -16,
పల్నాడు -8,
పార్వతీపురంమన్యం -12,
శ్రీకాకుళం -13,
విశాఖపట్నం -4,
విజయనగరం -22,
వైఎస్సార్ -2 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
గురువారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు
అనకాపల్లి -8,
కాకినాడ -1,
నంద్యాల-1,
విజయనగరం-1 మండలంలో తీవ్రవడగాల్పులు, 60 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి.