
Amaravati, February 22: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో 60 శాతం పైగా హెల్త్ కేర్ వర్కర్లకు రెండో మోతాదు వ్యాక్సిన్ డోస్ పంపిణీ పూర్తయినట్లు ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు 85 వేలకు పైగా హెల్త్ కేర్ సిబ్బంది ఇప్పటికే రెండో డోస్ వ్యాక్సిన్ అందుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఏదైమైనా ఏపీతో పాటు చాలా రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ మందకోడిగా సాగుతోంది. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ టీకా పట్ల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ టీకా వేసుకునే దిశగా హెల్త్ కేర్ మరియు ఫ్రంట్ లైన్ వర్కర్లకు అవగాహన కల్పిస్తుంది.
ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18,257 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 41 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,89,339 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,86,444గా ఉంది. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో ఎలాంటి కొవిడ్ మరణాలేమి నమోదు కాలేదు, ప్రస్తుతం ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7167గా ఉంది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 71 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,81,582 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 590 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.