Kadapa, May 15: వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు హైదరాబాద్ (Hyderabad) లో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎంపీ అవినాశ్‌రెడ్డిని ఇంతకుముందు కూడా సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. కాసేపట్లో అవినాశ్ రెడ్డి పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నట్లు తెలుస్తోంది.
వివేకానంద మృతి కేసులో సీబీఐ ఇప్పటికే సాక్షుల నుంచి కూడా ఎన్నో విషయాలను రాబట్టింది. ఈ కేసులో అధికారులు విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఏ1 నిందితుడుగా ఉన్న గంగిరెడ్డి ఇటీవలే నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.ఇటీవల అవినాశ్ ను సీబీఐ అధికారులు విచారించిన సమయంలో ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఆయనను అరెస్టు చేయలేదు. అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఆ సమయంలో హైదరాబాద్‌కు ఎంపీ అవినాశ్‌రెడ్డి కూడా వచ్చారు.
అమరావతి స్కాం, ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం కోర్టును ఆశ్రయించనున్న ఏపీ సీఐడీ
ఆ సమయంలో సీబీఐపై పలు వ్యాఖ్యలు చేశారు. అర్థం పర్థం లేని విషయాలను సీబీఐ పెద్దగా చూపుతోందన్నారు. విచారణలో అధికారులు పలు అంశాలను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే సీబీఐ ఉన్నాధికారులకు తెలిపామని అన్నారు. రెండో భార్యకు ఆస్తి రావాలని వివేక భావించారని, వాస్తవాల ఆధారంగా విచారణ జరపాలని చెప్పారు.