![](https://test1.latestly.com/wp-content/uploads/2023/04/CBI-and-Avinash-Reddy.jpg)
Kurnool, May 22: వివేకా హత్య కేసుకు (Viveka Murder Case) సంబంధించి విచారణ కోసం కడప వైసీపీ ఎంపీ (YSRCP MP) వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) కోసం కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి (Vishwabharathi Hospital) సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గుండెపోటుతో స్థానిక విశ్వభారతి ఆసుపత్రిలో చేరిన అవినాశ్ తల్లి అక్కడే చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తన తల్లి అనారోగ్యం నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. వరుసగా మూడోసారి కూడా విచారణకు రాకపోవడంతో ఆయన కోసం సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు. హైదరాబాద్, కడప నుంచి సీబీఐ అధికారులు వచ్చారు.
ఎప్పటికప్పుడు ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ కు..
అవినాశ్ కోసం సీబీఐ అధికారులు ఆస్పత్రికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్దకు కడప, పులివెందుల వచ్చిన వైసీపీ కార్యకర్తలే కాకుండా... స్థానిక కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆసుపత్రి గేటు వద్ద బైఠాయించి సీబీఐకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను సీబీఐ అధికారులు ఎప్పటికప్పుడు ఢిల్లీలోని హెడ్ క్వార్టర్స్ కు తెలియజేస్తున్నారు.