వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారు. శనివారం తాడేపల్లిగూడెంలోని పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో కలిసి లాంఛనంగా ప్రకటించారు. ఇందులో ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయం, పేదలందరికీ పక్కా ఇళ్లపై స్పష్టమైన హామీ ఇచ్చారు. 2019 లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని అన్నారు. ఇప్పుడు కూడా పక్కాగా అమలు చేయగలిగే హామీలను ప్రజల ముందు పెడుతున్నట్లు తెలిపారు. పాదయాత్రలో ఎన్నో కష్టాలు చూశానని.. అవన్నీ తీర్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు.
వైపీపీ మేనిఫెస్టో 2024లో అంశాలు ఇవే..
వైఎస్సార్ చేయూత రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేల పెంపు, వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దఫాల్లో రూ. 60 వేల నుంచి లక్షా 20 వేల వరకు పెంపు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు దఫాల్లో రూ.45 వేల నుంచి రూ.లక్షా 5 వేల వరకు పెంపు, అమ్మ ఒడి రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంపు, వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.3 లక్షలు వరకు రుణాలు.. రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500కు పెంపు, వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు