Amaravathi, July 14:  ఏపీలో సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ సర్వే(Center for national studies survey) కాకరేపుతోంది. ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందని ఈ సర్వేలో వెల్లడైంది. దీంతో వైసీపీ నేతలు దీనిపై కౌంటర్లు వేస్తున్నారు. సర్వే ఏజెన్సీ ఫేక్ అంటూ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై యుద్ధం జరుగుతోంది. సెంటర్ ఫర్ నేషనల్ స్డడీస్ సంస్థ అధినేత రాబిన్ శర్మ(Robin sharma) ఒక మోసగాడు అంటూ ఫైరయ్యారు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. టీడీపీ త‌ర‌ఫున ప‌నిచేస్తున్న వెబ్ సైట్ల జాబితా ఇదేనంటూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి బుధ‌వారం ఓ ఆస‌క్తికర ట్వీట్ చేశారు. టీడీపీ(TDP) కోసం న‌డుస్తున్న వైబ్ సైట్లు ఇవేనంటూ ఆయ‌న త‌న ట్వీట్‌లో జాబితాను కూడా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ కోసం ప‌నిచేస్తున్న ఈ వెబ్ సైట్ల‌న్నీ ఒకే ఐపీ అడ్రెస్ నుంచి న‌డుస్తున్నాయ‌ని గోపిరెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సైట్ల‌న్నీ కూడా టీడీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త రాబిన్ శ‌ర్మ పేరిటే రిజిస్ట‌ర్ అయి ఉన్నాయ‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఈ వెబ్ సైట్ల(Websites) జాబితాతో కూడిన త‌న ట్వీట్‌కు అరెస్ట్ రాబిన్ శ‌ర్మ‌, ఫ్ర‌స్ట్రేటెడ్ టీడీపీ పేరిట హ్యాష్ ట్యాగ్‌ల‌ను కూడా గోపిరెడ్డి జ‌త చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్భలంతోనే ఈ ఫేక్ వెబ్ సైట్లు(Fake websites) పనిచేస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు సర్వేను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదంతా బోగస్ సర్వే అంటూ రుజువులతో సహా సోషల్ మీడియాలో పోస్టుల వార్ చేస్తోంది.