![](https://test1.latestly.com/wp-content/uploads/2021/06/YSRCP-MP-vijayasai-reddy-380x214.jpg)
Visakhapatnam, June 2: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతున్న విశాఖపట్నం మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలనా రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఆర్డీఏ చట్టానికి, మూడు రాజధానులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
అయితే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖ (visakhapatnam) ఎప్పుడు అవుతుందనే విషయంలో డేట్ మాత్రం అడగొద్దని విజయసాయి చెప్పారు. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఆయన (YSRCP MP vijayasai reddy) అన్నారు.బుధవారం విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. '' త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నుంచి పరిపాలన చేస్తాము.సీఆర్టీఏ కేసుతో రాజధాని తరలింపునకు సంబంధం లేదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు.
Here's MP Vijayasai Reddy Tweets
విశాఖపట్నం జిల్లాలో కోవిడ్ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈరోజు కలెక్టరేట్ లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. pic.twitter.com/a1SzrmdJI4
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 2, 2021
విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఇటీవల శంకుస్థాపన చేసిన విశాఖ అభివృద్ధి ప్రాజెక్టులపై ఈరోజు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, మేయర్, స్థానిక మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. pic.twitter.com/XM7A2lbeQ3
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 2, 2021
విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై కోర్టుకు అఫిడవిట్ ఇచ్చాం. కోర్టు అనుమతి మేరకు ఇళ్ల యజమానులకు పట్టాలిస్తాం. సింహాచలం భూముల చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తాం. ఏలేరు-తాండవ రిజర్వాయర్ అనుసంధానానికి రూ.500 కోట్లు మంజూరు చేయనున్నాం. విశాఖలో ప్రతి వార్డును అభివృద్ధి చేస్తాం'' అని తెలిపారు.
విశాఖలో కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రోడ్ వేస్తామని, ముడుసర్లోవ పార్కుని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పాలన సాగించవచ్చని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రంగువెలిసిన పార్టీలో ఉత్తేజం నింపాలంటే కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమైన కార్యాచరణను ఇవ్వాలని, ప్రజలతో మమేకమై వారి అభిమానాన్ని చూరగొనాలని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఏ కులాన్ని ఎలా మేనేజ్ చేయాలి, విద్వేషాలను రెచ్చగొట్టి సామరస్యాన్ని ఎలా దెబ్బతీయాలనే కాలం చెల్లిన వ్యూహాలకే పదును పెడుతున్నారని ఎద్దేవా చేశారు.