
Hyderabad, Mar 17: చికెన్ (Chicken) ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా తగ్గాయి (Chicken Prices Plummet). గత వారంతో పోలిస్తే ధరల్లో భారీగా కోత పడింది. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ రూ. 170లోపే లభిస్తుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 కంటే తక్కువకు దొరుకుతున్నది. గత వారం స్కిన్ లెస్ చికెన్ ధర ఏకంగా రూ.280 - రూ.310 వరకూ వెళ్లింది. రాష్ట్రంలో కోళ్ల లభ్యత పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
