Heavy Traffic at Panthangi Toll Plaza (Credits: X)

Vijayawada, Oct 11: దసరా, సంక్రాంతి పండుగలు తెలుగు రాష్ట్రాల (Telugu States) ప్రజలకు అతిముఖ్యమైనవి. ఎక్కడ ఉన్నా ఈ రెండు పండుగలకు అందరూ తమ ఇళ్లకు చేరుకోవాల్సిందే. ఇక దసరా రానే వచ్చింది. దీంతో సొంతూళ్ళకు వెళ్లే వాళ్లు బస్సులో, సొంత వాహనాల్లో కదిలారు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. రేపే దసరా పండుగ కావడంతో హైదరాబాద్-వరంగల్ రహదారిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా (Panthangi Toll Plaza) వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. టోల్ ప్లాజా అధికారులు టోల్ గేట్‌ ల సంఖ్యను ఆరు నుండి ఎనిమిదికి పెంచినప్పటికీ వాహనాలు రద్దీ పెరుగుతూ వస్తుంది. ట్రాఫిక్‌ ను క్రమబద్ధీకరించడానికి పోలీసులకు, టోల్‌ ప్లాజా సిబ్బందికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

Here's Video:

కారణం ఇదే!

దసరా కోసం సొంతూళ్ళకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లు, బస్సులు కూడా బారులు తీరారు. నల్గొండ, సూర్యాపేట, దేవరకొండ, కోదాడ, హుజూర్‌ నగర్‌ లలో తెలంగాణ బస్సులు తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో నిండిపోయాయి. వాహనాలు వేల సంఖ్యలో వస్తుండటంతో అధికారులు ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. ఇక, బస్సుల్లో, రైళ్లలో సీట్లు లేకపోవడంతో చాలా మంది తమ సొంత వాహనాలతో రోడ్ల మీదకు రావడమే ఈ ట్రాఫిక్ కి కారణంగా పోలీసులు చెప్తున్నారు.

ముగిసిన పారిశ్రామిక దిగ్గ‌జం అంత్య‌క్రియ‌లు, పార్సి సాంప్ర‌దాయం ప్రకార‌మే కానీ..నూత‌న ప‌ద్ద‌తిలో అంత్య‌క్రియ‌ల నిర్వ‌హ‌ణ‌