Hydra is not doing anything illegal says Ranganath

Hyderabad, Sep 28: ఏపీ మాజీ మంత్రి, వైఎస్సాఆర్ సీపీ నేత శిల్పా మోహ‌న్ రెడ్డికి (Shilpa Mohan Reddy) హైడ్రా (HYDRA) నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌పేట మండ‌లం నాగ్స‌న్‌ ప‌ల్లిలోని న‌ల్ల‌వాగును ఆయన ఆక్ర‌మించి వెంచ‌ర్ వేసిన‌ట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. ఇటీవ‌ల స‌ర్వే చేప‌ట్టిన అధికారులు వెంచ‌ర్‌ లోని అక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'హైడ్రా' కూల్చివేత‌ల భ‌యంతో కూక‌ట్‌ ప‌ల్లిలో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేద‌న్న క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్

Here's Video: 

అప్పుడు జరిగినట్టు..

క‌ర్నూలు జిల్లా నంద్యాల‌కు చెందిన‌ శిల్పా మోహ‌న్ రెడ్డి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మాజీ సీఎం వైఎస్ఆర్ మంత్రివ‌ర్గంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న ఫ్యామిలీ వ్యాపారంతో పాటు వెంచ‌ర్లు వేసి నిర్మాణాలు చేప‌ట్టేది. శిల్పా మోహ‌న్ రెడ్డి మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే న‌ల్ల‌వాగును క‌బ్జా చేసి వెంచ‌ర్‌ లో నిర్మాణాలు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం.

తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఘటన