![](https://test1.latestly.com/wp-content/uploads/2024/03/44-2.jpg?width=380&height=214)
Khammam, Feb 7: ఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి (Leopard Sighting) కనిపించినట్టు స్థానికులు తెలిపారు. చిరుత పాద ముద్రలు కనిపించడంతో అటవీశాఖ అధికారులు (Forest Officials) అప్రమత్తమయ్యారు. పులి గుండాల ప్రాజెక్టు సమీపంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు మైక్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పులి గుండాల సమీపంలో వ్యవసాయ పనుల కోసం వెళ్లేవారు గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్ళాలని సూచించారు. రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు హెచ్చరిక చేశారు.
తిరుమలలో కూడా..
ఏపీలోని తిరుమలలోనూ చిరుత సంచారం మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. చిరుతను చూసిన భక్తులు.. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పక్కన ఉన్నవారికి చెప్పడంతో వారు కూడా అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు చిరుతను గాలిస్తున్నారు.