Leopard In Srishailam (Credits: X)

Srishailam, Jan 6: శ్రీశైలంలో (Srishailam) చిరుత పులి (Leopard) కలకలం సృష్టించింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి చిరుత వచ్చింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్టు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. కాగా గత కొన్ని రోజులుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

‘ఫార్ములా-ఈ’ కేసులో నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్.. రేపు ఈడీ విచారణ కూడా..

అనంతపురంలో కూడా..

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం కన్నెపల్లి రోడ్డులో కూడా మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రెండు ఆవుదూడలపై చిరుత దాడి చేసి చంపేసింది. చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు.

కొండపైకి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి.. తిరుమలలో ఘటన