
Hyderabad, March 13: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ (MLC Elections Polling) ప్రారంభమైంది. ఏపీలోని (AP) 9 జిల్లాల పరిధిలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఉపాధ్యాయ, 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలోని (Telangana) ఒక ఉపాధ్యాయ స్థానంలో పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని సీఈసీ ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఈ నెల 16న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారని వివరించారు. ఇప్పటికే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని మీనా వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం ఓటర్లు 10,56,720 మంది అని వివరించారు. వారిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు 10 లక్షల 519 మంది అని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 55,842 మంది అని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు 3,059 మంది అని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మొత్తం 1,538 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ముఖేశ్ కుమార్ మీనా చెప్పారు.
ఇప్పుడు సిగ్నేచర్ బ్యాంక్ వంతు.. మూసేసిన అధికారులు.. బాధ్యులను వదిలిపెట్టబోమన్న బైడెన్