Hyderabad, May 25: ఎండకు శరీరం నిర్జలీకరణం జరిగితే పిల్లలు డీహైడ్రేషన్ బారినపడుతారు. ఈ పరిస్థితి ఎదురైతే దీనికి చికిత్సలో భాగంగా చిన్నారులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)(WHO) ఆమోదించిన ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్)ను (ORS) మాత్రమే ఇవ్వాలని పిల్లల వైద్యనిపుణులు డాక్టర్ శివరంజని సంతోష్, డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ కరుణ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ కంపెనీల ఓఆర్‌ఎస్ లో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ద్రావణాలను ఇవ్వకపోవడమే మంచిదని వెల్లడించారు.
డబ్ల్యూహెచ్‌వో ఓఆర్‌ఎస్ ఎక్కడ ఉంటాయంటే?
పిల్లలకు చికిత్స చేయడంలో ఓఆర్‌ఎస్ పాత్రపై శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహనా సమావేశంలో వారు మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్‌ఎస్ ద్రావణం పిల్లలకు అమృతంలా పనిచేస్తుందన్నారు. డబ్ల్యూహెచ్‌వో ఆమోదించిన ఓఆర్‌ఎస్ ద్రావణం అన్ని ప్రభుత్వ దవాఖానలతోపాటు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మెడికల్ షాపుల్లో లభ్యమవుతుందని తెలిపారు.
క్రిప్టో ఐకాన్, మన సోషల్ మీడియా చింటూ డాగ్ కబొసు ఇక లేదు.. మరణించిన జపనీస్ శునకం