COVID Outbreak- Representational Image (Photo Credits: IANS)

Hyderabad, March 16:  తెలంగాణలో కోవిడ్19 విస్తరణ పెరుగుతోంది, దాదాపు అన్ని జిల్లాల్లో కోవిడ్ ప్రభావం కనబడుతోంది. రాష్ట్రంలో నిర్వహించే కరోనా టెస్టులను బట్టి కేసుల సంఖ్య కూడా పెరుగుతూపోతుంది. అయితే కోవిడ్ ఉన్నప్పటికీ టెస్టులు చేసుకోకుండా బయట తిరిగేవారు ఇంకా ఎందరో ఉన్నారు. అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ ల్యాబులు తాము నిర్వహించిన టెస్టుల ఫలితాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వెల్లడించడం లేదు, దీంతో ఒకరోజులో వాస్తవానికి ఎంతమందికి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిందనేది కూడా ఖచ్చితంగా తెలియరావడం లేదు.

మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంతో తెలంగాణకు ఉన్న సరిహద్దులను ప్రభుత్వం మూసివేసింది. అంతరాష్ట్ర రవాణ మరియు ఆర్టీసీ బస్సులు తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ విద్యాసంస్థలు మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. చాలా మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ బారిన పడుతుండటమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. సోమవారం నాడు మంచిర్యాల జిల్లాలో ఓ పాఠశాలలో పనిచేసే 12 మంది టీచర్లతో పాటు మరో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే వారంతా కూడా ఎలాంటి లక్షణాలు కనబరచడం లేదు. వారిని ప్రస్తుతం ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, నిన్న రాత్రి 8 గంటల వరకు 60,263 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో  204 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 439 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,01,522కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 37 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 14, మరియు రంగారెడ్డి నుంచి 12 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,656కు పెరిగింది.

మరోవైపు సోమవారం సాయంత్రం వరకు మరో 170 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,97,851 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 2015 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి, రెండో డోసుల టీకాల పంపిణీతో పాటు 60 ఏళ్లు పైబడిన పౌరులకు, అలాగే 45 నుంచి 59 ఏళ్లుండి దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగిన వారికి COVID వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అర్హులైన నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రాలకు వచ్చి వ్యాక్సిన్ పొందవచ్చునని, ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా టీకా అందిస్తారని ఆరోగ్యశాఖ అధికారులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 7,51,639 మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఆరోగ్య శాఖ నివేదిక వెల్లడించింది.