Coronavirus in India (Photo Credits: PTI)

Hyderabad, April 24: తెలంగాణలో శుక్రవారం కొత్తగా మరో 13 కరోనా పాజిటివ్‌ కేసులు (Telangana Corona Report) నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా (telangana corona cases) కేసుల సంఖ్య 983కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 25కు చేరుకోగా, 262 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణ కరోనా బులిటెన్ ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ (Etela rajender) వెల్లడించారు. 80 జిల్లాల్లో నో కేసులు, ఇండియాలో కరోనా రికవరీ శాతం 20.57, మొత్తం 23 వేలు దాటిన కరోనా కేసులు, కొత్తగా 1752 కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా ప్రస్థుత స్థితిపై మంత్రి మీడియా ద్వారా మాట్లాడుతూ... నూతనంగా నమోదైన కేసులతో కలిపి తెలంగాణలో (Telangana) కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 983కు చేరుకుందని తెలిపారు. వీటిలో 663 యాక్టివ్‌ కేసులున్నాయన్నారు. కరోనా నుంచి కోలుకొని ఇవాళ 29 మంది డిశ్చార్జీ అవుతున్నట్లు తెలిపారు. బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు 25 మంది మృతిచెందినట్లు పేర్కొన్నారు.  చైనా నాసిరకం కిట్లకు డబ్బులు చెల్లించలేదు, ఆ కిట్లను వెనక్కి పంపిస్తాం, ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ, మీడియాతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్

రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల నుంచే కరోనా కేసులు ఎక్కువ నమోదైనట్లు మంత్రి ఈటెల వెల్లడించారు. సూర్యాపేట, గద్వాల, జీహెచ్‌ఎంసీ, వికారాబాద్‌ ఈ నాలుగు ప్రాంతాల్లోనే కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.

Here's Minister Eatala Rajender Press Meet

వికారాబాద్‌లో 14 కుటుంబాల నుంచి 38 మందికి, గద్వాలలో 30 కుటుంబాలలో 45 మందికి, సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, జీహెచ్‌ఎంసీ పరిధిలో 44 కుటుంబాల నుంచి 265 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. ప్రధాని ‘దో గజ్ కి డూరి’ నినాదం, కరోనా మంచి గుణపాఠం నేర్పింది, పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా సర్పంచులతో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

గాంధీ ఆస్పత్రిపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నరని మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిని సంపూర్ణ కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చామని, మరమ్మతులు చేసి కొవిడ్‌ ఆస్పత్రికి ఉండే సౌకర్యాలు కల్సించినట్లు తెలిపారు. పాత ఫోటోలతో సైకోలు, శాడిస్టులు దుష్ప్రాచారం చేస్తున్నారన్నారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కరోనా బాధితులకు పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నామన్నారు. వైద్యసిబ్బంది ఆత్మైస్థెర్యం దెబ్బతీసేలా కొంతమంది వ్యవహరిస్తున్నారన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఏ ఒక్క పేషెంట్‌ కూడా సదుపాయాలు సరిగా లేవని చెప్పలేదన్నారు. వైద్యులను వేధించినా, దాడులకు పాల్పడ్డా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినా కొందరు లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి రోడ్లపై యదేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నెల వ్యవధిలో హైదరాబాద్‌లో 11 లక్షల వాహనాలకు జరిమానా విధించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు కమిషనరేట్లలో పెద్దఎత్తున వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌లో 4.65 లక్షల వాహనాలకు జరిమానా విధించగా, 45 వేల వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ పరిధిలో 5.39 లక్షల వాహనాలకు జరిమానా విధించగా, 12 వేల వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 87 వేల వాహనాలకు జరిమానా విధించగా, 5,337 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.