Mulugu Horror: పాఠశాలలో పురుగుల మందు తాగిన నాలుగో తరగతి బాలికలు.. ములుగు జిల్లాలో కలకలం

Mulugu, Feb 3: పాఠశాలలో (School) తరగతులు జరుగుతుండగా నాలుగైదు తరగతులు చదువుతున్న బాలికలు (Girls) ముగ్గురు పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా (Mulugu District) వెంకటాపూర్ మండలం కేశవాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిందీ ఘటన.

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. వాడీవేడి చర్చకు అధికార, విపక్షాలు సిద్ధం

నాలుగో తరగతి చదువుతున్న ఆరెపల్లి అక్షర (9), సాదు అఖిల (9), ఐదో తరగతి చదువుతున్న సాదు ఐశ్వర్య (10) ఏడుస్తుండడంతో గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని టీచర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు ఎందుకేడుస్తున్నారని ప్రశ్నించగా అక్షర బ్యాగులో ఉన్న తెల్లని డ్రింకును తాగినట్టు చెప్పారు. దీంతో అదేంటని పరిశీలించగా పురుగుల మందు వాసన రావడంతో అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయుడు రాజేశ్ కుమార్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చి వారిని బైక్‌పై ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే వారికి చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా, బాలిక స్కూలు బ్యాగులోకి పురుగులు మందు ఎలా వచ్చిందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.

ప్రారంభానికి ముందే తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం, తెల్లవారుజామున కలకలం, అదుపులోకి వచ్చిన మంటలు