Waranagal, June 29: వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం విశ్వనాథపురంలో దారుణం (Warangal Shcoker) చోటుచేసుకుంది. ఏడేళ్ల బాలికపై తాత వయస్సు(55) ఉన్న ఓ వ్యక్తి (55-year-old man) అత్యాచారయత్నానికి (Attempted raping) పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. విశ్వనాధపురంలోని బాధిత బాలిక తండ్రి గతంలో మృతి చెందగా తల్లితో పాటు ఇంటివద్దే ఉంటోంది. సోమవారం సాయంత్రం తాగునీరు తీసుకురావడానికి సమీపంలో ఉన్న వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లింది.
అక్కడ బాలికను పసునూరి ఐలయ్య అనే వ్యక్తి మాటల్లో దింపి చెరువు వద్దకు తీసుకెళ్లాడు. ఆపై ఆ బాలికపై అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక కేకలు వేయడంతో ఆ ప్రాంతంలో ఉన్న ఇద్దరు యువకులు గమనించి బెదిరించడంతో ఐలయ్య పారిపోయాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు ఐలయ్య ఇంటికి వెళ్లి అతడి కోసం వెతికారు. అయితే అతను కనిపించకపోవడంతో ఇంటి తలుపులు పగులగొట్టారు. ఈ దారుణ ఘటనపై స్థానికులు 100 నంబర్‌కు డయల్ చేయడంతో మామునూరు ఏసీపీ నరేశ్‌కుమార్, మామునూరు సీఐ రమేశ్, గీసుకొండ ఎస్సై బండారి రాజు సిబ్బందితో రాత్రి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
గొడవలకు పాల్పడవద్దని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని గ్రామస్తులను శాంతింపజేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించామని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ నరేశ్‌కుమార్ తెలిపారు.