TSPSC

Hyderabad, SEP 16: తెలంగాణలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల(JPS) రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యింది. రెగ్యులరైజేషన్‌కు అర్హులైన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు 6,603 ఉన్నట్లుగా గుర్తించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ శనివారం గ్రేడ్‌- 4 పంచాయతీ కార్యదర్శుల (Panchayat Secretary Officers) పోస్టులను క్రియేట్‌ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై జేపీఎస్‌లు పంచాయతీరాజ్‌ కార్యదర్శులుగా గ్రేడ్‌- 4 హోదాలో కొనసాగనున్నారు. గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి ఉండాలనే లక్ష్యంతో ఒకేసారి 9వేలకు పైగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను సీఎం కేసీఆర్‌ మంజూరు చేశారు. వీరికి పరీక్ష నిర్వహించి అర్హులైన వారిని జేపీఎస్‌లుగా నియమించారు.

Thummala Resigned BRS Party: బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న తుమ్మల 

గత నాలుగు సంవత్సరాలుగా వీరు జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగేండ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న వారందరినీ క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్‌, డీఎస్పీ, డీఎఫ్‌వోలతో కమిటీని నియమించి రెగ్యులరైజేషన్‌కు అర్హులైన వారి జాబితాను పంచాయతీరాజ్‌కు అందించారు. జేపీఎస్‌లను పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-4లను క్రియేట్‌ చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు పంచాయతీరాజ్‌ శాఖ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టులపై ఆర్థిక శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.