 
                                                                 Hyd, May 12: పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు Regional Passport Office Hyderabad గుడ్ న్యూస్ తెలిపింది. స్లాట్‌ల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అదనంగా 7,150 స్లాట్స్ విడుదల చేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు 5,500 స్లాట్లు అదనంగా విడుదల చేశామని, అలాగే ఏప్రిల్ 29వ తేదీన శనివారం పాస్‌పోర్టు డ్రైవ్‌లో మరో 3,056 స్లాట్లు విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించినట్లు పేర్కొన్నారు.
అయినప్పటికీ ఇంకా దరఖాస్తుదారులు స్లాట్ల లభ్యతకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తుండటంతో అదనంగా 7,150 స్లాట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేట, అమీర్‌పేట్, టోలిచౌకితో పాటు కరీంనగర్, నిజామాబాద్‌లలోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో తత్కాల్, సాధారణ, పీసీసీల కోసం స్లాట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
అదనపు స్లాట్లను ప్రతి బుధ, శుక్రవారాల్లో సాయంత్రం 4.30కు విడుదల చేస్తామని వివరించారు. తమ అధికారిక పోర్టల్, ఎంపాస్‌పోర్ట్‌సేవా యాప్ ద్వారా షెడ్యులింగ్, రీ షెడ్యూలింగ్ చేసుకుని కొత్త తేదీల్లో స్లాట్లు పొందవచ్చని తెలిపారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
