Cheruvugattu Brahmotsavams begins at Nalgonda(video grab)

నల్గొండ జిల్లా చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు(Cheruvu Gattu Brahmotsavam) అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జడల రామలింగేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవానికి భారీగా తరలివచ్చారు భక్తులు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham).

నేటి నుంచి ఈనెల 21 వరకు జాతర జరగనుంది. జాతర నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ గోపురాలు, చుట్టు పక్కల ఉన్న శివుడు, గణపతి విగ్రహాలకు రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు(Jadala Ramalingeswara Swamy Temple).

ఈ నెల 17 తేదీ ఉదయం 4 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 18న ఆదివారం స్వామి వారి అగ్నిగుండాలు, 19న దీపోత్సవం, అశ్వవాహన సేవ జరుపుతారు. 20న మహా పూర్ణాహుతి, పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. 21న సాయంత్రం 4 గంటలకు గజ వాహనంపై చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించి బ్రహ్మోత్సవాలను పూర్తి చేస్తారు.  వీడియో ఇదిగో, కులగణన సర్వే పేపర్లు తగలబెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ

Cheruvugattu Brahmotsavams begins at Nalgonda