TTD Take Action on BRS Leader Srinivas goud(X)

Hyd, December 20:  తిరుమల శ్రీవారిని గురువారం శ్రీనివాస్ గౌడ్ దర్శించుకునన్ సంగతి తెలిసిందే. తిరుమలలో టీటీడీ అవలంభిస్తున్న వైఖరిని తప్పుబట్టారు శ్రీనివాస్ గౌడ్. తిరుమలలో దర్శనాలు, గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారు..గడచిన పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. ఇప్పుడు ఇరురాష్ట్రాల ప్రజలను టీటీడీ సమానంగా చూడడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

తిరుమల కొండపై శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. అయితే కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై స్పందించకుండా కేవలం శ్రీనివాస్ గౌడ్ మీదే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు టీటీడీ చైర్మన్.  

తిరుమలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుల పై చర్యలు తీసుకోకుండా.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలకు ఆదేశించడం సరికాదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ నాయకులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ కూడా ఇదే తరహాలో టీటీడీ పై కామెంట్స్ చేశారు. బాలకృష్ణ నా తమ్ముడు కాదు అన్న, నా కన్నా రెండేళ్లు పెద్ద, నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

తిరుమల గుడికి తెలంగాణ నుండి లెటర్స్ వస్తే ఈవో ఆక్సెప్ట్ చేయడం లేదు. ఇదే ఆంధ్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం ఈవోలకు కాల్ చేస్తే స్పెషల్ దర్శనాలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు మీరు కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి.. మేము చెప్తే తిరుమల దర్శనం జరిగేటట్లు ఈవోకు ఆదేశాలు ఇవ్వండన్నారు. లేదంటే మేము కూడా కలిసి నిర్ణయం తీసుకొని మిమ్మల్ని బాయ్‌కాట్ చేసి భద్రాచలం, యాదగిరి గుట్టలో లెటర్స్‌పై దర్శనం జరగకుండా చేస్తాం అని హెచ్చరించారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అలాగే తిరుమల దేవస్థానంలో తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చేయడం కరెక్ట్ కాదు. ఏపీ, తెలంగాణ నాకు రెండు కళ్ళు అన్న చంద్రబాబు మర్చిపోయారా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.