Aara Poll Survey: తెలంగాణలో టీఆర్‌ఎస్ హ్యాట్రిక్ ఖాయం, ఆసక్తిరేపుతున్న ఆరా సర్వే, రెండోస్థానంలో బీజేపీ, మూడో ప్లేస్‌లో కాంగ్రెస్, ఏయే ప్రాంతాల్లో పోటీ ఎలా ఉందో తేల్చిన సర్వే
Muncipal Polls. Image used for representational purpose. | Photo: Pixabay

Hyderabad, July 14: తెలంగాణలో ముందస్తు ఎన్నికల (Telengana Elections) ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో ఓ సర్వే (Survey) సంస్థ చేసిన సర్వే ఆసక్తికరంగా మారింది. తెలంగాణ‌లో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ఏ పార్టీ విజయం సాధిస్తుంది? టీఆర్ఎస్ (TRS) మ‌రోసారి విజ‌య దుందుభి మోగిస్తుందా? కాంగ్రెస్‌కు (Congress) పూర్వ వైభ‌వం సాధ్య‌మ‌వుతుందా? దూకుడుగా ముందుకు వెళ్తున్న బీజేపీ (BJP) తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తుందా? ఈ సందేహాలు తెలంగాణ ప్రజల్లో ఇప్ప‌టికే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ‘ఆరా పోల్ స్ట్రాట‌జీ ప్రైవేట్ లిమిటెడ్’ (Aara poll stratugy pvt.Ltd) సంస్థ ప‌లు విష‌యాలు తెలిపింది. ‘ఆరా తెలంగాణ‌ స‌ర్వే’ (Aara telengana Survey) పేరిట చేసిన‌ ఓ స‌ర్వే వివ‌రాలను విడుద‌ల చేసింది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని తేల్చింది.

YCP vs TDP: టీడీపీ కోసం పనిచేస్తున్న ఫేక్ వెబ్‌సైట్లు ఇవే! ఆధారాలతో సహా సోషల్ మీడియాలో వెల్లడించిన వైసీపీ ఎమ్మెల్యే, రాబిన్ శర్మను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్  

తెలంగాణ‌లో రాజ‌కీయ స్థితిగ‌తులు పార్టీల బ‌ల‌బ‌లాలు, ఓట‌ర్ల వైఖ‌రి గురించి ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఓ సారి తెలంగాణ‌లోని 119 నియోజ‌క వ‌ర్గాల్లోని మూడో వంతు నియోజ‌క వ‌ర్గాల్లో స‌ర్వేలు(Surveys) నిర్వ‌హించామ‌ని పేర్కొంది. ఈ విధంగా 2021 న‌వంబ‌రు నుంచి 2022 జూలై మ‌ధ్య మూడు ద‌ఫాలుగా తెలంగాణ‌లోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో స‌ర్వే నిర్వ‌హించామ‌ని పేర్కొంది. ఈ మూడు విడ‌త‌ల్లో పార్టీల‌కు వ‌చ్చిన స‌రాస‌రి ఓట్ల శాతం గురించి వివ‌రాలు తెలిపింది. టీఆర్ఎస్ కు 38.88 శాతం, బీజేపీకి 30.48 శాతం, కాంగ్రెస్ కు 23.71 శాతం, ఇత‌రులకు 6.91 శాతం ఓట్లు రానున్న‌ట్లు తెలిసింద‌ని పేర్కొంది. 2018 ఎన్నిక‌ల్లో 46.87 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్… అనంత‌రం జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 5 శాతం ఓట్లను కోల్పోయి 41.71 శాత‌మే సాధించింద‌ని తెలిపింది. తాజా స‌ర్వే ప్ర‌కారం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే టీఆర్ఎస్ 8 శాతం ఓట్ల‌ను కోల్పోయి 38.88 శాతం ఓట్ల‌ను పొంద‌నుంద‌ని పేర్కొంది.

Perni Nani Fires on TDP:అదంతా బోగస్ సర్వే! రాబిన్ శర్మ టీడీపీ జీతగాడు, జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్‌ను ఎవరూ పడేయలేరు, పొలిటికల్ సర్వేపై మాజీ మంత్రి పేర్నినాని ఫైర్, టీడీపీని పైకి లేపే కుట్ర అంటూ మండిపాటు 

ఇక ఖమ్మం, నల్గగొండ, వరంగల్‌లో టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉంటుందని, మెదక్‌, మహబూబ్‌నగర్‌లో త్రిముఖ పోటీ ఉంటుందని ఆరా అంచనా వేసింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ ఉండగా, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య పోటీ ఉంటుందని తెలిపింది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వైఎస్సార్‌టీపీ బలమైన పార్టీగా ఎదుగుతుందని ఆరా సంస్థ వెల్లడించింది. మరోవైపు.. టీఆర్‌ఎస్‌-87, బీజేపీ-29, కాంగ్రెస్‌కు53 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారని సర్వే వెల్లడించింది. ఇక, ఆంధ్రా సెటిలర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. నార్త్‌ ఇండియా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుతున్నారని స్పష్టం చేసింది.