Hyderabad, Apr 16: హైదరాబాదీలకు (Hyderabad) ముఖ్య గమనిక. ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సిటీ బస్సులను (City Buses) సగానికి సగం తగ్గిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఎండలు మండుతున్న వేళ ప్రయాణికులు అంతంతమాత్రమే ఉంటున్నారని.. బస్సులను ఖాళీగా తిప్పలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని టీఎస్‌ఆర్టీసీ వివరణ ఇచ్చింది.
ఏ సమయాల్లో ఎలా??
మొత్తం 2550 బస్సులకు 1275 అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఉదయం 5 నుంచి మొత్తం బస్సులు ఉంటాయని, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకూ సగం బస్సులు నడుస్తాయని.. సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్ని బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది.