Hyderabad, JAN 14: హైదరాబాద్‌లో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి (Sankrathi) పండుగ వేళ ఎగురవేస్తున్న పతంగులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వేర్వురు ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పండుగ వేళ విషాదం అలుముకున్నది. పతంగులు ఎగురవేస్తూ భవనంపై కింద పడి యువకుడు తుదిశ్వాస విడిచారు. మాంజాదారం మెడకు చుట్టుకొని (Chinese Manjha) తీవ్ర గాయాలతో సైనికుడు ప్రాణాలను (Army Personnel Died) విడిచాడు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంకు చెందిన సైన్యంలో సేవలందిస్తున్న కోటేశ్వరరావు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకొని ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌస్‌పై వద్ద మెడకు మాంజా చుట్టుకున్నది. దీంతో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలకు గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే అల్వాల్‌లో యువకుడు భవనంపై నుంచి కిందపడ్డాడు.
మృతుడిని పేట్ బషీర్‌భాగ్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్‌ఐ తనయుడు ఆకాశ్‌గా గుర్తించారు. పతంగుల కారణంగా గత రెండురోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. చైనా మాంజాపై నిషేధం ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పలువురు విక్రయిస్తున్నారు. పతంగులను ఎగురవేస్తూ ఇష్టారాజ్యంగా వదిలివేస్తుండడంతో మాంజాదారం ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే, పక్షులు సైతం బలవుతున్నాయి.