Arvind Kumar interrogation ends at ACB office(X)

Hyd, january 8:  ఏసీబీ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు విచారణ కొనసాగింది. అరవింద్ కుమార్ ను విచారించింది ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం.

ఫార్ములా ఈ కార్ రేసులో నిధుల మళ్లింపుకు సంబంధించి అరవింద్ కుమార్ ను ప్రశ్నించి, స్టేట్మెంట్ రికార్డు చేసింది ఏసీబీ. ఈ సందర్భంగా పలు ప్రశ్నలను సంధించారు. తెలంగాణలో మందుబాబులకు షాక్, కింగ్‌ఫిషర్ బీర్లు సరఫరాని నిలిపివేసిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, తెలంగాణ ఎక్సైజ్ కమీషనర్ దీనిపై ఏమన్నారంటే..

విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక ఉన్న అసలు కోణం ఏంటి.?, ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు?,ఎవరికి ప్రయోజనం జరిగింది?,నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా? అని ప్రశ్నించింది ఏసీబీ.

Arvind Kumar interrogation ends at ACB office

అసలు రూ.55 కోట్లు నిధుల విదేశీ అకౌంట్లు కు జమ చేయడం ఎవరి నిర్ణయం?, కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు విడుదల చేసినట్లు అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.