Asaduddin Owaisi (Photo-ANI)

తెలంగాణకు చెందిన ఎంపీలు ఈరోజు లోక్ సభలో ప్రమాణం చేశారు.అయితే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది. అసదుద్దీన్ ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు. ఈ నినాదాలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది.

తాజాగా లోక్ సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై పాలస్తీనా అనడంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన ప్రమాణం చేశాక పార్లమెంట్ వెలుపల మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. జై పాలస్తీనా అనడం తప్పు కాదా? అని ప్రశ్నించారు.  ఎన్డీయేకి భారీ షాక్.. చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక, ఓం బిర్లాకు పోటీగా సురేశ్‌‌ను బరిలోకి దించిన విపక్ష ఇండియా కూటమి

అసదుద్దీన్ స్పందిస్తూ... తాను చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. జై పాలస్తీనా అంటే ఇబ్బంది ఏమిటని నిలదీశారు. అభ్యంతరం చెప్పేవాళ్ల గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహాత్మా గాంధీ కూడా పాలస్తీనా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని సూచించారు. నేను చెప్పాల్సింది చెప్పానని వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ వెల్లడించారు.

Here's Video

ఇక వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణం చివరలో కావ్య జై భీమ్, జై భద్రకాళి, సేవ్ కానిస్టిట్యూషన్ అని నానాదాలు చేశారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. చివరలో జై హింద్, జై తెలంగాణ, జై సంవిధాన్ అని నినదించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు.

గోడం నగేశ్, అసదుద్దీన్ ఒవైసీ హిందీలో ప్రమాణం చేశారు. గడ్డం వంశీకృష్ణ, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. సురేశ్ షెట్కార్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తెలుగులో ప్రమాణం చేశారు. ఈటల జై సమ్మక్క సారలమ్మ అని నినదించారు.