
Assembly Election 2023 Results Live News Updates: ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరం ముగిసింది.ఐదో రాష్ట్రమైన మిజోరంలో ఓట్ల లెక్కింపు సోమవారానికి వాయిదా పడింది. ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన నేతల భవితవ్యం నేడు వెల్లడి కానుంది. కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న నేపథ్యంలో ఫలితాలపై దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
నేడే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న కౌంటింగ్
తెలంగాణలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు ప్రారంభించారు. మొత్తం 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. అరగంట నుంచి గంటలోపు ముగియనున్న కౌంటింగ్ ముగియనుంది. అనంతరం ఉదయం 8.30గం.కి ప్రారంభం కానున్న ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కరీంనగర్‌లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు.