File: Google

Hyderabad, Nov 21: హైదరాబాదులోని (Hyderabad) హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) (IRL) నిర్వహించడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శనాస్త్రాలు సంధించారు. నగరం నడిబొడ్డున కార్ల రేసులు (Car Race) నిర్వహిస్తారా? అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ట్రాఫిక్ కు (Traffic) ఇబ్బంది లేకుండా కార్ల రేసింగ్ నిర్వహిస్తామని అన్నారు. కార్ల రేసింగ్ కు ఖర్చు చేసే ప్రతి పైసా, వసూళ్ల వివరాలను పారదర్శకంగా వెల్లడిస్తామని తెలిపారు.

జాబిల్లిపై ఉదయిస్తున్న పుడమి... దృశ్యాలను చిత్రీకరినించిన జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. వీడియో ఇదిగో!

బండి సంజయ్ నిన్న శామీర్ పేటలో బీజేపీ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో బీజేపీకి 2 ఎంపీ సీట్లు ఉంటే నేడు 303 స్థానాలను గెలిచే స్థాయికి ఎదిగిందని అన్నారు. అయితే అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పుడూ కోరుకోదని స్పష్టం చేశారు.