
Hyderabad, Apr 7: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. మెట్రో రూ.59 హాలిడే కార్డును (తర్వాత రూ. 99కి మార్చారు) (Holiday Card) మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతోపాటు 10 శాతం రాయితీని కూడా ఎత్తేశారు. సాధారణ రోజుల్లో ఉండే మెట్రో కార్డు కొంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు.. రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఇచ్చే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో మెట్రో రైలుకు డిమాండ్ పెరగి, రద్దీ ఊహించని రీతిలో పెరిగిపోయిందని, అందుకే రాయితీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
