Hyderabad, May 14: తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నారని, దమ్ముంటే రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేసీఆర్‌పై (KCR) ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణను కేసీఆర్ (KCR) అప్పుల్లో ముంచేశారని అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో(Tukkuguda) నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో (BJP Rally) అమిత్ షా ప్రసంగించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి అసమర్ధ సీఎంను చూడలేదన్నారు. బాయిల్డ్ రైస్ (Boild rice) కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పినట్లు బంగారు తెలంగాణ అయిందా? అని అమిత్‌షా (Amith shah) ప్రశ్నించారు. తెలంగాణలో కేంద్ర పథకాల పేర్లు మార్చడమే కానీ చేసిందేమీలేదన్నారు. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేయాలన్నారు.
Telangana CM KCR wants to turn this state into Bengal, it has to be stopped now. We will ensure that the killers of BJP worker Sai Ganesh are given the harshest punishment: Union Home Minister Amit Shah in Hyderabad pic.twitter.com/WH3jws0m0U
— ANI (@ANI) May 14, 2022
వరంగల్ సైనిక్ స్కూల్‌కు (Warangal Sainik school) 2016లో అనుమతి ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని షా చెప్పారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా తెలిపారు. కేసీఆర్‌కు అమిత్‌షా సవాల్ విసిరారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రతి గింజా కొంటామని తెలిపారు. తన మాటలు వింటుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని అమిత్‌షా అన్నారు. కేసీఆర్ ను తరిమేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు జరిగాయా? అని ప్రశ్నించారు. బీజేపీ (BJP) గెలిస్తే నీళ్లు, నిధులు, నియామకాలు హామీ నెరవేరుతుందన్నారు.
లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఒక్కరికీ చేయలేదన్నారు. కేసీఆర్ రెండు పడకగదుల ఇళ్లు(Double bedroom) ఎంతమందికి ఇచ్చారని అడిగారు. ప్రధాని ఆవాస్ యోజనను(PM Awas Yojana) రాష్ట్రంలో అమలు చేయట్లేదని విమర్శించారు. నగరంలో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తానని మోసం చేస్తున్నారని తెలిపారు. గాంధీ(Gandhi), ఉస్మానియాను(osmania) పట్టించుకోని సీఎం కొత్తగా నిర్మిస్తారా? ఇంత అవినీతి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదన్నారు. ఈ అవినీతి సర్కార్‌ను గద్దె దించేందుకు యువత కదలిరావాలని పిలుపిచ్చారు. కేంద్రం నిధులిచ్చే పథకాలనే కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర పథకాలకు పేర్లు, ఫొటోలు మార్చి అమలు చేస్తున్నారని విమర్శించారు.
ఇది ఒక ప్రభుత్వాన్ని కూల్చి మరో ప్రభుత్వాన్ని తెచ్చే యాత్ర కాదు.. ఇది ఒక ముఖ్యమంత్రిని మార్చేందుకు చేపట్టిన యాత్ర కాదు… ఇది బీసీ, దళిత, గిరిజనులు, రైతుల సంక్షేమం కోసం చేపట్టిన యాత్ర అన్నారు. తెలంగాణలో నిజాంను తలపిస్తున్న వారిని తొలగించేందుకు చేపట్టిన యాత్ర అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి తాను రావాల్సిన అవసరం లేదన్నారు. దానికి బండి సంజయ్ ఒక్కడు చాలు.. కానీ, తెలంగాణలో నయా నిజాంలా మారిన చంద్రశేఖరరావును మార్చాలా వద్దా అని అమిత్ షా ప్రశ్నించారు.