Hyd, May 29: ప్రజా భవన్ బాంబ్ బెదిరింపు కేసులో 24 గంటలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రజాభవన్‌లో, నాంపల్లి కోర్టులో బాంబ్ పెట్టినట్లు కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసిన రామకృష్ణ.. అధికారులను కంగారు పెట్టించాడు.
అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్‌కు చేరుకొని అణువణువు గాలించారు. రెండుగంటలకుపైగా తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద వస్తువులు ఏవీ దొరకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అకతాయి పనిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తి కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో నిందితుడు శివరామకృష్ణను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మద్యం సేవించి డయల్ 100 కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్, ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నం అయిన పోలీసులు
రామకృష్ణ భార్యతో గొడవ పడి మధ్యనికి బానిసగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య దూరం అవ్వడంతో ఆమె లేదని బాధలో ఫోన్ చేసినట్లు పోలీసులు తేల్చారు.శివరామకృష్ణ ముషీరాబాద్‌లో నివాసం ఉంటుండగా.. అతని స్వస్థలం గుంటూరు జిల్లాగా గుర్తించారు.
రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను చంపేస్తామంటూ పలు నంబర్ల నుంచి ఫోన్ చేసి బెదిరించారు. ఈ విషయాన్ని రాజా సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన షేర్ చేశారు. ఈ క్రమంలో రాజా సింగ్ మాట్లాడుతూ.. తనను చంపుతామని పదే పదే హెచ్చరిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా దీనిపై చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బెదిరింపు కాల్స్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు, తెలంగాణ డీజీపీ రవిగుప్తాకు లేఖ కూడా రాశానన్నారు.
ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని రాజా సింగ్ అన్నారు. తనకు ఫోన్ చేసి బెదిరించినవాళ్లు ఎన్ని తన వద్ద ఎన్ని నంబర్లు ఉన్నాయని అడిగారని.. అందుకు ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చానని తెలిపారు. రేవంత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వెళ్తే అయినా చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో సీఎం నంబర్ ఇచ్చానని తెలిపారు. ధర్మం కోసం పనిచేస్తే తనను, తన ఫ్యామిలీని చంపేస్తామని బెదిరిస్తున్నారని అన్నారు.