BRS Harishrao questions Telangana Police on Crime incidents

Hyd, July 31:  తెలంగాణలో ఒక్కరోజే నాలుగు చోట్ల అత్యాచారాలు జరిగాయి. దీనిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వనస్థలీపురం పిఎస్ పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం,ఓయూపిఎస్ పరిధిలో ప్రయాణీకురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం,నల్లగొండ జిల్లా శాలిగౌరారం లో దివ్యాంగ మహిళపై అత్యాచారం,నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్. ఇలా ఒకే రోజు నాలుగు చోట్ల అత్యాచార సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.

సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, మహిళలకు భద్రత కరువైందని, పెరిగిన అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదని మండిపడ్డారు హరీష్ రావు. చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని...మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం అన్నారు. అత్యాచార బాధితులను భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఇవే ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై దృష్టి సారించి, నిందితులకు కఠిన శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దీనిపై తెలంగాణ పోలీసులు స్పందించారు. మన రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడటం కోసం మా పోలీస్ శాఖ అత్యంత నిబద్ధతతో పనిచేస్తుంది. జరిగిన ఘటనల పట్ల నిందితులపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవటానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకాడబోమని తెలిపారు. ప్రభుత్వ డాక్టర్ ఆత్మహత్య, సీపీఐ ఎమ్మెల్యే వేధింపులే కారణమని ఆరోపణ?, కూనంనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్? 

Here's Tweet: