Hyd, Aug 21:సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం అని, చీప్ మినిస్టర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టమన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. భారత రైతు సమితి అని కొత్త అర్ధం చెప్పారు. రైతులకు ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. కోస్గి మండలంలో 22వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 8వేల మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందన్నారు.
రుణమాఫీ కోస రైతులు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి చేస్తున్నారని, దీనికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్న రైతులపై ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర అనుమతి అవసరం లేదు, హైకోర్టులో కేంద్రం కౌంటర్, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై తమకు సమాచారం లేదని వెల్లడి
రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ ది ఒక మాట అయితే మంత్రులది...రుణమాఫీ విషయంలో మంత్రులకే సమన్వయం లేదని విమర్శలు చేశారు. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.