BRS KTR surprise inspection of STP in Fateh Nagar(BRS X)

Hyd, Sep 25: పబ్లి సిటీ స్టంట్లతో సీఎం రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు అని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఎస్టిపిని సందర్శించింది బీఆర్ఎస్ బృందం. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్... మూసీ సుందరీకరణను సీఎం రేవంత్ పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఆరోపించారు.

మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారు అన్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా? అని ప్రశ్నించారు కేటీఆర్. గ్రేటర్ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తాం అన్నారు.

పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక ఒక ఉదాహరణ అని తెలిపిన కేటీఆర్... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు కానీ పబ్లి సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం గడుపుతున్నారన్నారు. దేశంలోనే 31ఎస్టీపీలు ఉన్న ఏకై‌న నగరం హైదరాబాద్ అని ..ఇది కేసీఆర్ ముందు చూపుకు నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సిటీలో నిర్మించిన అన్ని ఎస్టీపీలను సందర్శించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు.  ఓఆర్ఆర్ లోపల ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సిందే, బాధిత పేదలకు డబుల్ బెడ్ రూం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, పాతబస్తీ మెట్రోపై కీలక రివ్యూ 

మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పలువురు సీనియర్ నేతలు ఎస్టీపీని సందర్శించిన వారిలో ఉన్నారు

హైదరాబాద్ నగరాన్ని మురికి నీటి రహిత నగరంగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ3866 కోట్ల రూపాయలతో భారీ ఎత్తున మురిగినీటి శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.