BRS Protest for Rythu Runa Mafi, KTR Slams CM Revanth Reddy

Hyd, Aug 22:  రైతుల రుణమాఫీ కోసం కదం తొక్కింది బీఆర్ఎస్. రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేపట్టింది. ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌ చేస్తూ బీఆర్ఎస్ పిలుపుతో రైతులు కదిలివచ్చారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టారు.

ఆలేరులో హరీశ్‌ రావు, చేవేళ్లలో కేటీఆర్ బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ నేతలకు బెదిరింపులకు పాల్పడటం సరికాదని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల తాటాకు చప్పళ్లకు తెలంగాణా భయపడదని స్పష్టం చేశారు. రుణమాఫీ పై ప్రశ్నిస్తేనే బెదిరిపోతున్నారు, భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అంటే పచ్చి బూతులు, పిచ్చి మాటలు అనుకుంటున్నారని, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజలు నిన్ను వదలరని అన్నారు. అసలు అదానీ మంచోడా లేక చెడ్డోడా అనే విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ కూర్చొని తేల్చుకొని తమ అభిప్రాయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రజాపాలన కాదు.. అరాచక పాలన అని, ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు.. నిరంకుశ రాజ్యం అని దుయ్యబట్టారు. రుణమాఫీ చేయమని రైతుల అడిగితే.. వాళ్ల మీద కేసులు, రుణమాఫీ గురించి జర్నలిస్టులు ప్రశ్నిస్తే.. వాళ్ల మీద దాడులు అని దుయ్యబట్టారు. రేవంత్.. ఏ ఒక్క ఊర్లోనైనా రుణమాఫీ పూర్తయిందా దమ్ముంటే రా పోదాం! అని సవాల్ విసిరారు కేటీఆర్.

Here's Video:

 రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డి పల్లికి వెళ్లిన ఇద్దరు ఆడబిడ్డలు, మహిళా జర్నలిస్టులు సరిత, విజయ రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాన్ని తప్పుబట్టారు కేటీఆర్. రుణమాఫీ గురించి అడగడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టులను బుదరలో తోసి, దాడి చేశారని..రేవంత్ రెడ్డి నిజంగా రుణమాఫీ చేసి ఉంటే ఆ జర్నలిస్టుల మీద ఎందుకు దాడి చేశారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై దాడి, రాళ్లు - కోడిగుడ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, ఖండించిన హరీశ్ రావు

Here's Video:

ఆగస్టు 15 లోగా రైతులందరికీ రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాసి పెట్టుకోండి.. చెప్పి చేద్దాం, వాళ్ల లాగా దొంగ దెబ్బ తీయడం కాదు చెప్పి చేద్దాం అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మనం అధికారంలో వచ్చాక ఇలాంటి చిల్లర పనులు చేయకూడదు.. కాబట్టి ముందే బాకీ తిరిగి ఇచ్చేద్దాం అన్నారు.

Here's Video:

రైతులను రోడ్లపైకి తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని ...న్నికల ముందు తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ గెలిచాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు నేడు గుర్తిస్తున్నారని చెప్పారు.

రైతుల ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.