KTR Lauds Poet Nandini Sidda Reddy

Hyderabad, DEC 14: తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని (Nandini Sidda Reddy) బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామరావు (KTR) మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నగదు పారితోషకం, ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో సిధారెడ్డి (Nandini Sidda Reddy) చూపిన నిబద్ధత, తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుంన్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్ణయంపై కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు. అల్వాల్‌లోని నివాసంలో జరిగిన సమావేశంలో కేటీఆర్, సిధారెడ్డితో ఉద్యమకాల స్మృతులను నెమరేసుకున్నారు. ప్రభుత్వమే తెలంగాణ అస్థిత్వంపై కుట్రలు చేస్తున్న ఈ తరుణంలో తెలంగాణ సమాజానికి నందిని సిధారెడ్డి గట్టి సందేశం పంపారన్నారు.

 KTR Lauds Poet Nandini Sidda Reddy

 

తెలంగాణ బిడ్డలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా వెనుకాడరనే.. సిధారెడ్డి ఈ ధైర్యవంతమైన నిర్ణయం సమాజానికి గొప్ప సందేశం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. సమావేశంలో తెలంగాణపై ప్రస్తుతం జరుగుతున్న అస్థిత్వ దాడులపై చర్చ జరిగింది. ఇప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండి తమ హక్కులను రక్షించుకోవాల్సిన, అవసరం ఉందని, తెలంగాణ సమాజం మరోసారి ఐక్యంగా పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో కవులు, కళాకారులు ఎప్పుడూ ముందుంటారని కేటీఆర్‌ అన్నారు. నందిని సిధారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. నందిని సిద్ధారెడ్డి తాను రాసిన కొన్ని పుస్తకాలను కేటీఆర్‌కు అందించారు. సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్, బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్, దేవి ప్రసాద్, దాసోజు శ్రవణ్ పాల్గొన్నారు.