Hyd, Aug 29: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ రావడంతో హైదరాబాద్‌కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక తన సోదరికి బెయిల్ నేపథ్యంలో అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మార్చి 15న రాత్రి 7: 15కి ఇంటి నుంచి డిల్లీకి వెళ్లిన కవిత...ఆ తర్వాత 165 రోజులకు బుధవారం రాత్రి 7: 15కి తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అనంతరం కేటీఆర్‌కి రాఖి కట్టారు కవిత.
కవిత బెయిల్‌పై వచ్చిన వెంటనే కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే కేటీఆర్ అమెరికా పర్యటన వ్యక్తిగతమే. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్. "Off to the United States.. Dad duty beckons" అని ఎక్స్ ద్వారా వెల్లడించారు. కేటీఆర్ కొడుకు హిమాన్షు అమెరికాలో చదువుతున్న సంగతి తెలిసిందే. కొడుకు కోసం అమెరికా వెళ్తున్నట్లు వెల్లడించారు.
Here's KTR Tweet:
Off to the United States
Dad duty beckons
— KTR (@KTRBRS) August 28, 2024
అమెరికా పర్యటన తర్వాత రష్యాకు వెళ్లనున్నారు కేటీఆర్. సెప్టెంబర్ 5 నుంచి 7వతేదీ వరకు రష్యాలోని మాస్కోలో జరిగే ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ పోర్టల్ 2030-2050 సదస్సులో పాల్గొననున్నారు కేటీఆర్. ఇందుకు సంబంధించిన ఆహ్వారం రాగా ఫ్యూచరిస్టిక్ అనే అంశంపై ఈ సదస్సులో ప్రసంగించనున్నారు కేటీఆర్.
ఈ సదస్సులో ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధనా రంగంలోని విద్యార్థులు, ఇతర రంగానికి చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. వీరంతా భవిష్యత్తులో మరింత మెరుగైన అవకాశాలను సృష్టించడంపై చర్చించనున్నారు. మొత్తంగా కవిత బెయిల్‌పై హైదరాబాద్‌కు వచ్చిన మరుసటి రోజే కేటీఆర్ అమెరికా వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.