Car Plunges into Well (Photo-Video grab)

Hyd, Dec 1: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి బావిలో (Car Plunges into Well) ప‌డిపోయింది. చిట్టాపూర్‌, భూంపల్లి గ్రామాల మధ్యలో.. రోడ్డుపక్కన ఉన్న ఒక వ్యవసాయ బావిలో కారు అదుపుతప్పి పడిపోయింది. కాగా, రామాయణ్‌ పేట నుంచి సిద్ధిపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఫైరింజన్‌ అధికారులతో సహయంతో.. నీటిని తోడుతున్నారు.

పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది క‌లిసి బావిలో ప‌డ్డ కారును వెలికి తీసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. బావిలోతు సుమారు 15 నుంచి 20 గజాలుంటుందని స్థానికులు చెబుతున్నారు. రెండు ఫైరింజ‌న్ల‌తో బావిలోని నీటిని ఖాళీ చేస్తున్నారు. బావిలోపలి నీటిని పూర్తిస్థాయిలో తోడేస్తే గానీ కారులో ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు గజఈత గాళ్లు, స్థానికులు కూడా సహయక చర్యల్లో పాల్గోన్నారు. స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రమాద స్థలానికి చేరుకుని సహయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.