Raids On Chutneys (Credits: X)

Hyderabad, Oct 19: హైదరాబాద్‌ (Hyderabad) లో బయట భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ఆహార కల్తీ అధికమవ్వడమే దీనికి కారణం. కుల్లిన కూరగాయలు, మాంసం, నాసిరకమైన పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తూ కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు. చిన్న హోటల్స్ నుంచి పేరుమోసిన రెస్టారెంట్ల వరకూ ఇదే పరిస్థితి. తాజాగా కొండాపూర్‌ శరత్‌ సిటీ మాల్‌ లోని చట్నీస్‌ (Chutneys) రెస్టారెంట్ లో  టాస్క్‌ ఫోర్స్‌ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా వారి తనిఖీల్లో భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి.

తనని ఇంట్లో బంధించి.. బాడీగార్డులు, బౌన్సర్లతో కాపలా పెట్టారని గ్రీన్ పార్క్, ఆవాస హోటల్స్ డైరెక్టర్ ఆదాల దామోదర్ రెడ్డి భార్య రక్షణ రెడ్డి ఆరోపణలు.. రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ జీవీ ప్రసాద్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని వీడియోలో వెల్లడి (వీడియో ఇదిగో)

Here's Video:

తనిఖీల్లో బయటపడ్డ నిజాలు

తనిఖీలు చేపట్టిన అధికారులకు కందిపప్పు డ్రమ్ములో బొద్దింకలు ప్రత్యక్షమై షాక్ ఇచ్చాయి. గోధుమ పిండి, రవ్వకు పురుగులు పట్టి నల్లగా మారి మరో షాక్ ఇచ్చాయి. ఉల్లిగడ్డలు, క్యాబేజీలు పూర్తిగా కుల్లిపోయి కనిపించాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలను తయారుచేస్తున్నట్లు అధికారులుగుర్తించారు. దీంతో రెస్టారెంట్‌ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు.

రెండేళ్ల త‌ర్వాత జైలు నుంచి విడుద‌లైన మాజీ మంత్రి, ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఢిల్లీ సీఎం అతిషి, ఇత‌ర నేత‌లు (వీడియో ఇదుగోండి)