Case Against GHMC Mayor Vijayalakshmi

Hyderabad, OCT 13: బతుకమ్మ వేడుకల(Bhatukamma festival) సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున డీజే సౌండ్స్‌(DJ Sounds) ఉపయోగించిన ఘటనలో నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మితో(Mayor Vijayalakshmi) పాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 10న సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని ఎన్‌బీనగర్‌లో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించారు.

Konda Surekha in Another Controversy: మ‌రో వివాదంలో మంత్రి కొండా సురేఖ‌, ఎస్సై సీట్లో కూర్చొని పోలీసుల‌కు వార్నింగ్, రేవూరీ Vs కొండా ఫ్లెక్సీ వార్ లో వివాదాస్ప‌దంగా మంత్రి తీరు 

కాగా, రాత్రి 11.45 తర్వాత కూడా డీజే సౌండ్స్‌ పెట్టడంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే మహిళలు అడుకునే బతుకమ్మ వేడుకలను ఎలా ఆపుతారంటూ మేయర్‌ వారిని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌ కావడంతో ఈ మేరకు పోలీసులు కార్యక్రమ నిర్వాహకుడు విజయ్‌కుమార్‌, డీజే సౌండ్స్‌ నిర్వాహకుడు గౌస్‌తో పాటు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.