Y S Bhaskar Reddy

హైదరాబాద్‌: మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్యకేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి 14 రోజుల జ్యూడీషియల్ విధిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. రిమాండ్ అనంతరం  భాస్కర్‌ రెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు.  ఇదిలా ఉంటే  మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు  అయిన వివేకానంద ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు 15 మార్చి 2019 న పులివెందులలో తన నివాసంలో శవమై కనిపించారు.

ఈ కేసును తొలుత రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేసింది, అయితే జూలై 2020లో కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి అప్పగించారు. వివేకానంద హత్య కేసులో సీబీఐ 2021 అక్టోబర్ 26న ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో జనవరి 31, 2022న దర్యాప్తు సంస్థ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.