 
                                                                 Hyderabad, June 08: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దంపతులు నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఫిల్మ్‌సిటీకి వెళ్లారు. అక్కడ రామోజీరావు పార్థివదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. కాసేపు మౌనం పాటించారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామోజీ రావు భార్య రమాదేవి, కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్, ఆయన భార్య శైలజా కిరణ్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి సహా ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
#WATCH | Hyderabad: TDP chief N Chandrababu Naidu pays tribute to Eenadu & Ramoji Film City founder Ramoji Rao.
Ramoji Rao passed away while undergoing treatment at Star Hospital in Hyderabad early morning today. pic.twitter.com/z9qHXYSCoR
— ANI (@ANI) June 8, 2024
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం రేవంత్ ఆదేశాలు జారీచేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సింగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశించారు. ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు ఉంటాయి.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
