America, Aug 8: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సాగుతోంది. ఈ నేపథ్యంలో గుడ్ న్యూస్ అందించారు. అమెరికన్ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ చార్లెస్ ష్యాబ్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ అనంతరం ఈ ముఖ్యమైన నిర్ణయం, గుడ్ న్యూస్‌ని ప్రకటించారు.
డల్లాస్‌లోని ష్వాబ్ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరుగగా ష్వాబ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హోవార్డ్, రామ బోక్కా...ప్రభుత్వ సహకారంపై ప్రశంసలు గుప్పించారు. త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటిస్తామని హైదరాబాద్ సాంకేతిక ఆవిష్కరణలకు ప్రపంచ గమ్యస్థానంగా అభివృద్ది చెందుతుందన్నారు.
ఇక అనంతరం అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి డి.శ్రీధర్ బాబు , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి మహాత్ముడికి నివాళులర్పించారు రేవంత్.
హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీ ద్వారా దాదాపు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డీజీపీలుగా తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రమోషన్ పొందింది వీరే
Here's Tweet:
Exciting news for #Hyderabad ! @CharlesSchwab has chosen our city as the location for its first Technology Development Centre in India. This important decision comes after productive discussions with Honourable Chief Minister @revanth_anumula and IT Minister @OffDSB at Schwab's… pic.twitter.com/IJjyVFYgQ4
— Telangana CMO (@TelanganaCMO) August 8, 2024
మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కార్నింగ్ ఇన్‌కార్పొరేటేడ్ కంపెనీ తెలంగాణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకు వచ్చింది. వివిధ కంపెనీలతో భాగస్వామిగా నూతన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Here's Tweet:
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిగారు డల్లాస్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులు డి.శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారితో కలిసి మహాత్ముడికి నివాళులర్పించారు.#MahatmaGandhi #Telangana pic.twitter.com/SqSksYHHv8
— Telangana CMO (@TelanganaCMO) August 8, 2024
ఎమర్జింగ్ ఇన్నొవేషన్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోనాల్డ్ వెర్క్‌క్లీరెన్ అధ్వర్యంలోని కార్నింగ్ ప్రతినిధుల బృందంతో చర్చల అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు. 2025 నుంచి ఇందులో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమిస్తామని ప్రకటించారు.