CM KCR (Photo-ANI)

Hyderabad, May 18: కొత్త సచివాలయంలో (Secretariat) తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) జరుగనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (CM KCR) అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయంలో తొలిసారి జరగనున్న కేబినెట్ సమావేశం ఇది. ఇటీవలే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబరులో షెడ్యూలు ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది.

EC Allotted Symbols: తెలంగాణలో నాలుగు, ఏపీలో రెండు పార్టీలకే గుర్తింపు, కారును పోలిన పలు సింబల్స్ తొలగించిన ఎన్నికల సంఘం, తెలంగాణ షర్మిల పార్టీకి, ఏపీలో బీఆర్‌ఎస్‌కు దక్కని గుర్తింపు 

కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ కేబినెట్ సమావేశం అవుతుండడంతో మరింత ప్రాధాన్యం నెలకొంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రివర్గ సమావేశం (Telangana Cabinet) ప్రారంభం అవుతుంది. రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు కొన్ని నెల‌ల్లో జ‌ర‌గ‌నుండ‌డంతో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా… తెలంగాణ కేబినెట్ సమావేశమైన ప్రతిసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని ఇప్పటికే పలుసార్లు కేసీఆర్ స్పష్టం చేశారు.