Election Commission of India. (Photo Credit: Twitter)

Hyderabad, May 18: ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) విడుదల చేసింది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో (Car Symbol) జరిగిన నష్టాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో జరిగిన నష్టాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.

Telangana Assembly Elections 2023: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, 105 సీట్లు బీఆర్ఎస్ పార్టీవే, BRS పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో సీఎం కేసీఆర్ 

భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి కారు గుర్తు, ఏఐఎంఐఎం పార్టీకి గాలిపటం గుర్తు, తెలుగుదేశం పార్టీకి (TDP) సైకిల్ గుర్తు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(YSRCP)కి సీలింగ్ ఫ్యాన్ గుర్తును ఖరారు చేస్తూ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఏపీ విషయానికొస్తే కేవలం రెండే రెండు పార్టీలను ఎన్నికల సంఘం గుర్తించింది. వైఎస్పార్ సీపీకి సీలింగ్ ఫ్యాన్, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఖరారు చేసినట్లు ఈసీ పేర్కొంది.